కోట్లల్లో వ్యాపారం.. లక్షల్లో జీఎస్టీ ఎగవేత

29-09-2026 | 02:00pm

మండలంలో ప్రముఖ ఫర్టిలైజర్ జీఎస్టీ ఎగవేత

ఫర్టిలైజర్ షాపులో జీఎస్టీ అధికారుల దాడులు

కోట్లల్లో వ్యాపారం.. లక్షల్లో జీఎస్టీ ఎగవేత

దాడుల వివరాలు బహిర్గతం చేయని అధికారులు

మామూళ్ళ మత్తులో జీఎస్టీ అధికారులు

కన్నాయిగూడెం,సెప్టెంబర్ 29(విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి కన్నాయిగూడెం మండలంలో ఫెర్టిలైజర్ మాఫియా రాజ్యమేలుతుంది. కోట్లల్లో వ్యాపారం చేస్తూ లక్షల్లో ప్రభుత్వానికి జీఎస్టీ ఎగనామం పెట్టినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఓ ప్రముఖ ఫెర్టిలైజర్ షాపు(Fertilizer Shop) యజమాని ఏకంగా జీఎస్టీ(GST) ఎగవేత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.3-4  రోజుల క్రితం మండలంలోని  ఓ ప్రముఖ ఫర్టిలైజర్ షాపులో స్టేట్, సెంట్రల్ జీఎస్టీ (పన్ను) అధికారులు ఆకస్మికంగా దాడులు చేసినట్టు సమాచారం.

ఆ దాడుల్లో ఫర్టిలైజర్ యజమాని ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీని చెల్లించకుండా తప్పుడు లెక్కలు చూపించినట్టు తేలింది. దీంతో  స్టేట్, సెంట్రల్ జీఎస్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేసి యజమానిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీంతో కంగుతున్న వ్యాపారి ఏకంగా జీఎస్టీ అధికారులతో కాళ్ళబేరానికి వచ్చి లక్షల్లో ముడుపులు అందించినట్టు సమాచారం. దీంతో జీఎస్టీ అధికారులు సైతం దాడుల వివరాలు బయటకి పొక్కకుండా  గొప్యంగా ఉంచినట్టు సమాచారం. ఫర్టిలైజర్ వ్యాపారి మరియు జీఎస్టీ అధికారులు కుమ్మకైనట్టు మండలంలో గుసగుసలు వినబడుతున్నాయి.

మరిన్ని వార్తలు