సీఎం సభకు హెలిప్యాడ్‌ రెడీ

29-09-2026 | 02:02pm

కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి.. భద్రత నడుమ పనులు

రాజన్న సిరిసిల్ల29సెప్టెంబర్‌ (విజయక్రాంతి):ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్‌లో సీఎం ప్రయాణించే హెలికాప్టర్‌ కోసం హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను పూర్తి చేశారు. సభకు సంబంధించిన ఇతర ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు