విద్యార్థులతో మంత్రి సరదా ముచ్చట్లు
29-09-2026 | 01:54pm
తంగళ్ళపల్లి,సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి చదువులు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో పాటలు పాడిస్తూ సరదాగా గడిపారు.