బాధితులను కలిసిన మంత్రి
29-09-2026 | 02:26pm
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు
మంథని,(విజయక్రాంతి): నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామ సర్పంచ్ మెరుగు సురేష్ తండ్రి మెరుగు రాజయ్య, ఖాన్సాయిపేట గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కుంటాల వెంకన్నలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridharbabu) మంగళవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించి వారు త్వరగా కోలుకునేలా అవసరమైన సహకారం అందించాలని వైద్యులకు సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు.