రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని అభినందించిన బండి
ముకరంపుర, అక్టోబర్ 9(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అభినందించారు. ఈమధ్యనే ఎన్నికల ద్వారా ఎంపికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు(Service Activities) అందించాలని సూచించారు.
మానవతా దృక్పథంతో, సేవాభావంతో ప్రజలకు అండగా నిలవాలని అలాగే నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గంతో పాటు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీంధర్ సింగ్ పాల్గొన్నారు.