చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

22-10-2026 | 07:38pm

ముకరంపుర, అక్టోబర్ 22(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా సిఐటియు కమిటీ(Karimnagar District CITU Committee) ఆధ్వర్యంలో అక్టోబర్ 25,26 తేదీలలో జరగనున్న చలో హైదరాబాద్ పోస్టర్ గురువారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టిస్తున్న శ్రామిక వర్గానికి సంపదలో సరియైన వాటా ఇవ్వాలని అందుకు ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం రూ.42 వేలకు తక్కువ కాకుండా ఉండాలని డిమాండ్ చేశారు.

దేశ తలసరి ఆదాయం సుమారుగా 2,40,000 తెలంగాణ తలసరి ఆదాయం 4,19,000 ఉన్నదన్నారు. ఒక కుటుంబం సగటు నలుగురు వ్యక్తులు ఉంటారని, ఆ లెక్కన దేశంలో పనిచేసే 45 కోట్ల మంది శ్రామికులు, కార్మికులు, రైతులు, వైట్ కాలర్, ఇతర అన్ని రకాల ఒక్కొక్క శ్రామికుడు సగటున నెలకు రూ.80 వేల పైన సంపద సృష్టిస్తున్నారని కానీ దేశంలో పని చేస్తున్న 93 శాతం మంది శ్రామికులకు నెలకు రూ.8 నుండి 12,000 మాత్రమే పొందుతున్నారని అన్నారు. 

సంపద పంపిణీ శ్రామిక వర్గాలకు జరగాలని, అందుకు కార్మిక వర్గం రైతులను ఇతర శ్రామికులను కలుపుకొని పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, జనగాం రాజమల్లు, జి రాజేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు