రక్తంతో లేఖ రాసిన బీజేపీ నేత
ముకరంపుర, సెప్టెంబర్ 29(విజయ క్రాంతి):దళితుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, బీజేపీ దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు అందాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున తన స్వంత రక్తంతో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి పంపారు.
ఈ సందర్భంగా సోమిడి వేణు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన సబ్సిడీ రుణాలు, అభివృద్ధి నిధులు ఆగిపోవడం వల్ల దళిత యువకులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన అనేక హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.దళితుల
అభ్యున్నతి కోసం కేటాయించాల్సిన నిధుల పట్ల ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని సోమిడి వేణుప్రసాద్ తీవ్రంగాతప్పు పట్టారు. వెంటనే నిధులను విడుదల చేయాలని . లేనిచో దళితులను ఐక్యం చేసి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ మోర్చా అధ్యక్షులు బత్తుల లక్ష్మి నారాయణ, నాయకులు ఎడ్ల సురేష్, మెంగని రాజయ్య, గాలి సురేష్, పాల్గొన్నారు.