పేదల వైద్యానికి భరోసా.. రూ.53 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- 153 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు
హుజురాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ(Congress Party Constituency) ఇన్చార్జి వళితుల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మనోజ్ రావుతో కలిసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు 153 మంది లబ్ధిదారులకు రూ.53 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
హుజురాబాద్ పట్టణం, మండలంతో పాటు కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్, సేవాదళ్, యువజన, యూత్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్‌తో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.