ఎడ్లను ఎత్తుకెళ్లిన దొంగలు

20-09-2026 | 04:49pm

బోథ్. సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సోనాల మండలంలోని సాకేర గ్రామానికి చెందిన రైతు రమేష్ కు చెందిన ఎడ్లను శనివారం రాత్రి దొంగలించారు. ఇంటి ముందు కట్టి వేసి ఉంచిన ఎడ్ల(oxen)ను మ్యాక్స్ వాహనంలో ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. కాగా ఈ విషయమై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా వాహనం కనిపిస్తున్న నెంబర్ మాత్రం కనిపించడం లేదని తెలిసింది. ఎడ్ల దొంగతనంతో రైతుకు లక్ష రూపాయల మేరకు నష్టం జరిగింది.

మరిన్ని వార్తలు