నెక్నంపూర్‌లో అన్నప్రసాద వితరణ

20-09-2026 | 04:45pm

నాలుగేళ్లుగా భక్తులకు సేవలందిస్తున్న వి ఆర్ 4 సహయోగ్ ట్రస్ట్

మణికొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వినాయక నిమజ్జనం(Vinayaka Immersion) ప్రకృతి చక్రానికి ప్రతీక అని వి ఆర్ 4 సహయోగ్ చారిటెబుల్ ట్రస్ట్(Sahayog Charitable Trust) మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు అన్నారు. ప్రకృతి సిద్ధమైన మట్టి విగ్రహాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

నార్సింగి మున్సిపల్ సర్కిల్ పరిధిలోని నెక్నంపూర్ చెరువు సమీపంలో వి ఆర్ 4 సహయోగ్ చారిటెబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గత నాలుగేళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు లక్ష్మణ్ రావు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక భక్తులతో పాటు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను భక్తులు అభినందించారు.

మరిన్ని వార్తలు