గణేష్ మండపాల అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ
(ఖమ్మం, విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు పువ్వాడ అజయ్ కుమార్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక చవితి పర్వదినం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు అందించాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో నాయకులు ఆర్జేసీ కృష్ణ,పగడాల నాగరాజు,కర్నాటి కృష్ణ,బచ్చు విజయ్ కుమార్, బత్తుల మురళి,తోట రామారావు గోవిందమ్మ, ముక్కాల రాజేష్, కూరాకుల వలరాజు,వంగాల వెంకట్,బండి నవీన్,మోరంపూడి సాయి,పోట్ల శ్రీకాంత్, సిరిపురపు సుదర్శన్, పిల్లి శేఖర్,లక్ష్మి ప్రసన్న సాయి కిరణ్,దేవభక్తిని కిషోర్,గొల్లపుడి రాంప్రసాద్, మాటేటి కిరణ్, కొమ్ము విజేత, వల్లభనేని రామారావు, షకీనా, కృష్ణ ప్రసాద్, గార్లపాటి సంతోష్, చిక్కుల నాని, పవన్,గాదె అనిల్, సురేష్, వీరేందర్, అశోక్,మోహన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.