గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి

20-09-2026 | 04:38pm
  1. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
  2. వినాయక కాలనీలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

భూపాలపల్లి టౌన్, సెప్టెంబరు 20 (విజయ క్రాంతి):గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao) అన్నారు. మంజూర్‌నగర్‌ 9వ వార్డులోని శ్రీ వినాయక కాలనీలో ప్రతిష్ఠించిన గణనాథుడిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులు, మహిళలతో ఎమ్మెల్యే ఫొటోలు దిగారు.

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాలనీ మహిళలు వెయ్యి దీపాలతో గణనాథుడికి నీరాజనం పలికారు. ఏడో రోజు సుమారు 600 మందికి మహా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కాలనీ కుటుంబాలన్నీ కలసి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్, కార్యదర్శి పైతరి మహేష్, గౌరవ అధ్యక్షుడు సమాల లక్ష్మారెడ్డి, పసునూటి సుమన్, రావుల కనకయ్య, పవన్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, హరీష్, కోటేశ్వరరావు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు