తాడువాయిలో వాహనాల తనిఖీ
తాడ్వాయి,నవంబర్,03( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో(Tadvai Mandal Headquarters) మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తరచూ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు . అత్యవసర పని నిమిత్తం వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై పోలీసులు వెళ్లే వరకు అక్కడే భార్యా, పిల్లలతో వేచి ఉండి అవస్థలు పడుతున్నారు.
పోలీసులు ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. నెలలో ఒకటి రెండుసార్లు వాహనాలు తనిఖీ చేస్తే ఇబ్బందులు ఉండవని ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వంశీ,రాములు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.