పిల్లలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
- న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.సౌజన్య
సిద్దిపేట క్రైం, నవంబర్ 3: పిల్లలు చట్టాలపై అవగాహన కలిగిఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆ సంస్థ జిల్లా కార్యదర్శి కె.సౌజన్య(Judge K Soujanya) సూచించారు. న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్మన్, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ ఆదేశాల మేరకు మంగళవారం లార్డ్ పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం, బాలసదనాన్ని ఆమె సందర్శించారు. పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వారికి చట్టాలు, చదువు ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శిశుగృహాన్ని సందర్శించి గదులు, పరిసరాలు, పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జడ్జి వెంట బాలసదనం సూపరింటెండెంట్ వసంత, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.రాము, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది ఉన్నారు.