వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం..
సింగాపూర్ శివారులో జాతీయ రహదారి సమీపంలో ఘటన.. మృతుడి వివరాలపై ఆరా.
హుజురాబాద్, నవంబర్ 03: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల పరిధిలోని సింగాపూర్ శివారులో(Singapore suburbs) విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 563 సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో(Agricultural well) గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది.
బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా?
లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. యువకుడి మృతితో స్థానికంగా కలకలం నెలకొంది. మృతుడి వివరాలు తెలిసిన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.