టీఎమ్మార్పీఎస్‌ ఆలేరు మండల నూతన కమిటీ ప్రకటన

10-09-2026 | 03:04pm

ఆలేరు, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): టీఎమ్మార్పీఎస్‌(TMRPS) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ ఆదేశాల మేరకు ఆలేరు మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కందుల రామన్‌ మాదిగ టీఎమ్మార్పీఎస్‌ ఆలేరు మండల(Alair Mandal committee) నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా కందుల రామన్‌ మాదిగ మాట్లాడుతూ మాదిగలు రాజకీయంగా వెనుకబడటం వల్ల ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నారని అన్నారు.

మాదిగలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగడంతోపాటు తమ హక్కుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం టీఎమ్మార్పీఎస్‌ ఆలేరు మండల అధ్యక్షుడిగా జంగా రాములు మాదిగ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భూపెల్లి కేశవులు, ఎమ్మెస్సెఫ్‌ మండల ఇన్‌చార్జిగా రాంచర్ల గౌతమ్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు అందె సుధాకర్‌ మాదిగ, సీనియర్‌ నాయకులు రాంచర్ల సిద్ధులు మాదిగ, బోడ నరేష్‌, సైదాపురం సురేష్‌, కందుల యాదమల్లయ్య, పైసా రవి, కందుల మధు, మనుష్‌, అర్జున్‌, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు