వీబీజీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం
10-09-2026 | 03:23pm
బోథ్, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): వీబీజీరాంజీ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుందామని గ్రామ సర్పంచ్ వినోద్ సింగ్ చౌహాన్(Village Sarpanch Vinod Singh Chauhan) పేర్కొన్నారు. గురువారం సోనాల మండలంలోని పార్టీ(కె) గ్రామపంచాయతీలో పథకం అమలుపై వార్డు సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 318 పనులను గుర్తించడం జరిగింది. ఆయా పనులను వచ్చే ఏడాది చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్ కార్యదర్శి అమనిక, టెక్నికల్ అసిస్టెంట్ శంకర్ పి ఎస్ ఎ సుదాల్ సింగ్ గ్రామ సమైక్య అధ్యక్షురాలు సుజాత గ్రామస్తులు పాల్గొన్నారు.