క్షయ వ్యాధి రహిత గ్రామంగా కాలోజివాడి..

08-10-2026 | 05:27pm

తాడ్వాయి,అక్టోబర్,08( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామం(Kalojiwadi Village) క్షయ వ్యాధి రహిత(Tuberculosis-free) గ్రామంగా ఎంపికైంది. దీంతో గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వాన్ గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డికి ప్రశంస పత్రం అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోనే కాళోజి వాడి గ్రామం క్షయ వ్యాధి రహిత గ్రామంగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.

మిగతా గ్రామాలు సైతం క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా తయారు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్, కార్యదర్శి సతీష్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు