కేటీఆర్‌కు ఏమైంది..? ఇంట్లోనే చికిత్స!
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైరల్ జ్వరం, ఫ్లూ(Flu) లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆయనే సోషల్ మీడియా(Social Media) వేదికగా వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల సూచనలు తీసుకుంటూ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుని మళ్లీ యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం అనారోగ్యంతో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆయన కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్(Break) పడినట్లైంది. త్వరగా కోలుకుని తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి Stable(స్థిరంగా) ఉన్నట్లు తెలిపారు.