ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం..

04-11-2026 | 05:22pm

తాడ్వాయి, నవంబర్ 04 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), స్థానిక ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు చిత్రపటాలకు ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని ఉన్నత పాఠశాల గదుల నిర్మాణానికి నాబార్డ్ ద్వారా రూ.13.55 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భైరవి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ దుడుక గంగయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గడ్డం బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, తాడువాయి సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, నాయకులు సిద్ధిరాములు, శ్రీకాంత్, రమేష్,అఖిల్ రావు, మల్లేశం, బీరయ్య, చంద్రం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు