మండల ఆర్టీఐ రక్షక్‌ కన్వీనర్‌గా మణికంఠ ఎన్నిక

26-10-2026 | 11:19am

భిక్కనూర్, అక్టోబర్‌ 26 (విజయ క్రాంతి): బిక్కనూర్‌ మండల ఆర్టీఐ (RTI) రక్షక్‌ కన్వీనర్‌గా సాయి మణికంఠ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన (Awareness) కల్పిస్తూ, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం (Utilization) చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు