ప్రభుత్వ సలహాదారుకు బార్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి

19-09-2026 | 09:45pm

కోర్టు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించాలని కోరిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు 

కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 10  కోర్టు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని కామారెడ్డి బార్ అసోసియేషన్( Kamareddy Bar Association) అధ్యక్షుడు బత్తుల నారాయణ తో పాటు న్యాయవాదులు, శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలి ని కలిసి వినతి పత్రాలను అందజేశారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో నూతనంగా నిర్మించనున్న కోర్టు భవన సముదాయానికి ప్రభుత్వం నుంచి త్వరితగతిన నిధులు మంజూరు చేయించాలని న్యాయవాదులు ఈ సందర్భంగా కోరారు.

గతంలో తమరి కృషితో కామారెడ్డికి సబ్ కోర్టు మంజూరు చేయించినట్లుగానే, ప్రస్తుతం ప్రతిపాదిత నూతన కోర్టు భవన సముదాయానికి కూడా తమరి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది శ్యామ్ గోపాల్ రావు , సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, వెంకట్ రాంరెడ్డి, నిమ్మ దామోదర్ రెడ్డి, కె. వేణుగోపాల్ రావు , సూర్య ప్రసాద్, షబానా బేగం, ఆర్. దేవేందర్, రాజా బాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు