ఇంకుడు గుంతల వల్ల భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది
ఎంపీడీవో తాహీరా బేగం
ఎల్లారెడ్డి, అక్టోబర్ 30(విజయ క్రాంతి): యెల్లారెడ్డి మండలంలోని ఆద్విలింగాల్ గ్రామపంచాయతి(Advilingal Gram Panchayat) గ్రామం లో జరుగుతున్న పలు పనులను,ఎంపీడీవో సందర్శించడం జరిగింది.అనంతరం ఆమె ఆ గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి లతో మాట్లాడుతూ మ్యాజిక్ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు మరియు డ్రైయిన్ చివరి ఇంకుడు గుంతలను పరిశీలించడం జరిగింది.
అలాగే ఎస్‌హెచ్‌జి (స్వయం సహాయక సంఘం) భవన నిర్మాణాన్ని పరిశీలించి, పనులను నవంబర్ 19వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి వినియోగాన్ని తగ్గించాలని మరియు ఎల్ నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎఫ్‌ఏ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.