నరేంద్ర స్వామి మహారాజ్ నాణీజ్ధాం మఠానికి పాదయాత్ర
జుక్కల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): జుక్కల్ మండలం దోస్పల్లి సమీపంలో గల స్వామి నరేంద్ర చార్య మహారాజ్(Narendra Swami Maharaj) ఊపపీఠం నుంచి నరేంద్ర స్వామి భక్తులు అధిక సంఖ్యలో నాణీజ్దాం ముఖ్యపీఠం వరకు పాదయాత్రగా బయలుదేరారు. నేటి నుంచి 21 రోజులు ఈ పాదయాత్ర కొనసాగుతుందని భక్తులు ముఖ్య నిర్వాహకులు మౌళి కృష్ణ గౌడ్ తెలిపారు. ఇక్కడి నుంచి కర్ణాటక మహారాష్ట్రలోని ఆయా గ్రామాల మీదుగా రాత్రుల్లో పలు మందిరాల్లో నిద్రించి ఉదయం నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగు ఉందన్నారు.
అయితే నేటి రోజు ఉపపీఠం వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుకానుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాజీ ఎమ్మెల్యే అరుణతార లు వచ్చి పల్లకి సేవలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు చుట్టుపక్కల మండలాల నాయకులు కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.