మున్సిపల్ కార్మికులకు మూలవేతనం 30 వేలు వెంటనే అమలు చేయాలి
మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజ నర్సు డిమాండ్...
బాన్సువాడ,(విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు(Municipal Workers) 30 వేల రూపాయల మూల వేతనం వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజ నర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో గురువారం మున్సిపల్ యూనియన్ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పిఎఫ్ డబ్బులు(PF money) కార్మికుల అకౌంట్లో జమ చేయాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులవలే మున్సిపల్ కార్మికులకు కూడా డిఏ వర్తింపజేయాలని వెంటనే రెండో పి ఆర్ సి రిలీజ్ చేయాలని ఇప్పటికే మూడు సంవత్సరాలు మూడు నెలలు ఆలస్యం అయినది మున్సిపల్ కార్మికుల జీవితాలు పెరగకపోతే సమ్మెకు అయిన పోతామని దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ మున్సిపల్ అధ్యక్షుడు మాసూద్ యూనియన్ నాయకులు శివరాజు రాజేష్ గంగాధర్ రాజు సురేందర్ బిట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.