స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ

24-09-2026 | 01:27pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను(Smart ration cards) గురువారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota lakshmi kantarao) నిజాంసాగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలె మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ తహసిల్దార్ సాయి భుజంగారావు,నిజాంసాగర్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి,నాయకులు సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు