ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
తాడ్వాయి,నవంబర్,12(విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే కె.మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) చిత్ర పటానికి ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే రూ. కోటి ఎనిమిది లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే పాఠశాల నిర్మాణాలకు, రోడ్ల నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, నాయకులు పైడి రాజేశ్వర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.