రూ.75 వేల ఎల్‌ఓసీ మంజూరు

12-11-2026 | 07:01pm

వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని, నవంబర్ 12 (విజయ క్రాంతి) నిరుపేదలకు వైద్య చికిత్సలో ఆర్థిక భరోసా కల్పించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) మరోసారి అండగా నిలిచారు. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన బుద్ధార్థి సిద్ధార్థకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.75 వేల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధార్థకు ఆర్థిక సహాయం అవసరమని కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.75 వేల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.

ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సిద్ధార్థ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు