ఏడేండ్ల పెన్షన్ల నిరీక్షణ తెర

12-11-2026 | 06:54pm

బోథ్. నవంబర్ 12 ( విజయ క్రాంతి): పెన్షన్ల కోసం అర్హులైన వారు ఏడు సంవత్సరాల నిరీక్షించారని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అర్హులైన వారి ఇబ్బందులను గుర్తించి నూతనంగా పెన్షన్లను మంజూరి చేయడం జరిగిందని ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ పట్టణ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ మహేందర్ పేర్కొన్నారు .

మండల కేంద్రంలో గురువారం చేయుట పథకం కింద నూతనంగా మంజూరు పెన్షన్లను అందించారు. ఏడు సంవత్సరాల పాటు పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ప్రతి అధికారి వద్దకు ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి దరఖాస్తులు అందజేస్తూ తమ సమస్యను విన్నవించుకున్న పేద ప్రజల నిరీక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరదించారని సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ నిస్వాలకు లోనయ్యారన్నారు. తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తుందని భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి సన్నీ రెడ్డి, పనూరు పెరిసన్ దారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు