ఈ నెల 14న మండల స్థాయి ప్రతిభా పరీక్షలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీతత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థల(Brilliant educational institutions) ఆధ్వర్యంలో ఈ నెల 14న మండల స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థల ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ తెలిపారు. జనరల్ నాలెడ్జ్, వ్యాసరచన, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జూనియర్, సీనియర్ విభాగాల్లో శనివారం ఉదయం 9.30 గంటలకు ఓఎంఆర్ విధానంలో పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బూర్గంపాడు మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 13వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 98662 83566, 97051 37128 నంబర్లలో సంప్రదించాలని కోరారు.