కల్వచర్ల లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

12-11-2026 | 07:11pm

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి 

రామగిరి,నవంబర్12(విజయ క్రాంతి): రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని(Kalvacharla Village) గొల్లపల్లెలో గురువారం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Paddy Procurement Center) లాంఛనంగా ప్రారంభించారు. కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం ఏడు రకాల సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తోందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిందం తిరుపతి, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తులసి రామ్ గౌడ్,ఏఓ శ్రీకాంత్, ఏఈఓ అరవింద్, ఓర్రే సదయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు,వార్డు మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు, రైతులు,హమాలీలు,సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు