అంత్యక్రియలకు ఆర్థిక సాయం..

01-11-2026 | 10:01pm

తాడ్వాయి, నవంబర్ 01 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామంలో సోమవారం సాకలి చిన్న గంగారాం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల ఖర్చుల కోసం గ్రామ సర్పంచ్ ఎలేటి చంద్రారెడ్డి మృతుడి కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో ఎవరు మృతి చెందిన వారి కుటుంబానికి అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు