చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పరిశీలించిన మాజీ డిసిసిబి చైర్మన్

10-09-2026 | 08:09pm

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల ప్రారంభోత్సవం, సాగునీటి విడుదల, సభాస్థలి ఏర్పాట్లను గురువారం మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. సాగునీటి విడుదల మోటార్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ లు హాజరుకానున్నట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంతో రైతుల పొలాలకు నీరు చేరి వ్యవసాయానికి మరింత బలాన్ని చేకూర్చనుందనీ ఆయన తెలిపారు.పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతుల దిగుబడులు, ఆదాయం పెరిగేందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో దోహదపడనుందని తెలిపారు.

మరిన్ని వార్తలు