ఒక్క ఉపాధ్యాయుడితో ఐదు తరగతులు
మెల్లకుంట తాండ పాఠశాలలో 32 మంది విద్యార్థులు
ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవులో
డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించాలని వినతి
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తాండ గ్రామపంచాయతీ పరిధిలో గల తాటిచెట్టు గడ్డ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ బాల్య నాయక్(Sarpanch Balya Naik), గ్రామస్తులు మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఐదు తరగతుల్లో చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు మెటర్నిటీ సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడే ఐదు తరగతులకు బోధన నిర్వహిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఒక్క ఉపాధ్యాయుడితో అన్ని తరగతులను నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బోధన సక్రమంగా సాగడం లేదని,విద్యార్థులపై తగిన శ్రద్ధ చూపలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.