కాంగ్రెస్ హయాంలో రైతులకు కష్టాలు
మాజీ హాట్రిక్ ఎమ్మెల్యే షిండే
బిచ్కుంద, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): కాంగ్రెస్ హయాంలో(Congress regime) రైతులకు(farmers) కష్టాలు ఎదురవుతున్నాయని, కేసీఆర్ హయాంలోనే రైతులు సంతోషం వ్యక్తం చేశారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former Jukkal MLA Hanmanth Shinde) అన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్లూర్ గ్రామంలో ఎలినో ప్రభావంతో(El Nino effect) సరైన వర్షాలు లేక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక బోర్లు నుంచి నీరు అందుబాటులోకి రాక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. శనివారం పెద్ద తడ్గూర్ గ్రామంలో ఎండిపోయిన పత్తి, సోయా పంటలను మాజీ ఎమ్మెల్యే షిండే పరిశీలించారు.
రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడంతో పాటు, బోర్లు కు విద్యుత్ సరఫరా అందక పత్తి, సోయా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన రైతులందరికీ పరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు. పంటలు ఎండిపోతుండటంతో అప్పులు, పెట్టుబడుల భారంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే షిండే కోరారు.