రహదారులపై ధాన్యం ఆరబెట్టొద్దు

01-11-2026 | 10:16pm

వాహనదారుల భద్రత దృష్ట్యా రైతులు సహకరించాలి

ఎస్సై ప్రభాకర్

దోమకొండ, నవంబర్ 1 (విజయక్రాంతి): రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులను వినియోగించడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దోమకొండ ఎస్సై ప్రభాకర్(SI Prabhakar) తెలిపారు. మండలంలోని సంగమేశ్వర్ వెళ్లే రహదారిపై ధాన్యం ఆరబెడుతున్న నేపథ్యంలో రైతులకు ఆయన సూచనలు చేశారు. రహదారులపై ధాన్యం ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని వివరించారు.రైతులు తమ ధాన్యాన్ని కళ్లాల్లోనే ఆరబెట్టుకోవాలని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం కారణంగా ప్రమాదాలు జరిగితే సంబంధిత బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై ప్రభాకర్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు