ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలి
02-11-2026 | 07:48pm
జాప్యం చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి టౌన్, నవంబర్ 2 (విజయ క్రాంతి): ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను జాప్యం లేకుండా వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 78 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యలను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.