ధనుష్ కారు ఎక్కిన మిస్టరీ లేడీ ఎవరు?
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush)తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport)లో ధనుష్‌తో కనిపించిన ఓ మహిళ వీడియో ఈ చర్చకు మళ్లీ తెరలేపింది.
మృణాల్, ధనుష్ మధ్య సాన్నిహిత్యం ఉందంటూ గతంలో పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. మృణాల్ సినిమా కార్యక్రమానికి ధనుష్ హాజరవడం, ఆమె ధనుష్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకోవడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి కారణమయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మృణాల్.. ధనుష్ తనకు అన్నయ్యలాంటి వారని చెప్పినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో కొంతకాలం ఈ రూమర్స్‌కు బ్రేక్ పడింది.
తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ధనుష్ కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు ఆయనను కెమెరాల్లో బంధించారు. ఈ సమయంలో ధనుష్ కారులో ముందు సీట్లో ఉన్న ఓ మహిళ తన ముఖాన్ని చేతులతో కప్పుకునేందుకు ప్రయత్నించినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలించిన కొందరు నెటిజన్లు.. ఆ మహిళ మృణాల్ ఠాకూర్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది.
ధనుష్, మృణాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో కూడా ప్రచారం జరిగింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోతో ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. అయితే కారులో ఉన్న మహిళ మృణాల్ ఠాకూరేనా? వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం కొనసాగుతోందా? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. ప్రస్తుతం ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. సంబంధిత నటీనటుల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను రూమర్స్‌గానే చూడాల్సి ఉంటుంది.