11న నిర్మల్ లో కేటీఆర్ యువగర్జన
నిర్మల్ నవంబర్ 2 ( విజయ క్రాంతి): భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ ఈనెల 11న నిర్మల్ యువగర్జన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) యువతకు మోసం చేశారని పెద్ద ఎత్తున యువ గర్జనలో యువకులు పాల్గొన్నారు.
యువగర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు . పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
అదిలాబాదులో నిర్వహించడం రైతు గర్జనకు పెద్ద ఎత్తున రైతులు వచ్చి సంఘీభావం తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్, నిర్మల్ ఇన్చార్జ రామ్ కిషన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము తదితరులు ఉన్నారు