ఘట్ కేసర్ పట్టణ బంద్ విజయవంతం

02-11-2026 | 07:50pm

ఘట్ కేసర్, నవంబర్ 2 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో రైల్వే వంతెన నిర్మాణంలో(Construction of a railway bridge) జరుగుతున్న జాప్యం గురించి అఖిలపక్ష ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఘట్ కేసర్ బంద్(Ghatkesar town bandh) విజయవంతమైంది. పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేసి పూర్తిగా బంద్ పాటించాయి. నిర్మాణంలో ఉన్న ఘట్ కేసర్ రైల్వే బ్రిడ్జి నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా కాంట్రాక్టర్ ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ వరకు రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని లేనియెడల మాఉద్యమం ఆగదని, ఈ వంతెన పనులు పూర్తయ్యే వరకు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు అధికారులు కాంట్రాక్టర్ లను హెచ్చరించారు.

అఖిలపక్షం నిర్వహించిన బంద్ సందర్భంగా వారి ఆవేదన దృష్టిలో పెట్టుకుని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కాంట్రాక్టర్ సత్తిరెడ్డి తో ప్రజల మధ్యన ఫోన్ లో మాట్లాడడం జరిగింది. డిసెంబర్ నెల ఆఖరి కల్లా రైల్వే వంతెన పనులు పూర్తి చేస్తామని ప్రజల సమక్షంలో తెలియజేయడం జరిగింది. సందర్భంగా  అఖిలపక్షం ద్వారా  చేపట్టిన ఈ బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు