కాంగ్రెస్ ప్రభుత్వం-రైతులకు సంక్షేమం

02-11-2026 | 07:56pm
  1. రైతు లేనిదే రాజ్యానికి అన్నం లేదు.
  2. వివిధ గ్రామాల్లో ఐకెపి కేంద్రాలు ప్రారంభం
  3. పోతుగల్ ఏఎంసీ చైర్మన్ ఆరుట్ల మహేష్ రెడ్డి.

ముస్తాబాద్,అక్టోబర్ 02( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్,చీకోడ్, మద్దికుంట,మోహినికుంట గ్రామాల్లో పోతుగల్ వ్యవసాయ మార్కెట్(Potugal Agricultural Market) చైర్మన్ ఆరుట్ల మహేష్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి ఆ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు ఏఎంసి డైరెక్టర్లతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను(paddy procurement centers ) ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు కాకుండా ఐకేపీ కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.

సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని,ఐకేపీ నిర్వాహకులు రైతులకు సహకరించాలని అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహించాలని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ సడిమెల బాలయ్య  సర్పంచులు రవీందర్, ఆంజనేయులు,మురళి, రాజమల్లవ్వ ఉపసర్పంచ్లు ఏఎంసీ డైరెక్టర్లు మహిళా  సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకెపి అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు