మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ
20-09-2026 | 05:10pm
గణపురం, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ఎర్రమ్మగడ్డ ఎస్సీ కాలనీకి చెందిన మేకల వీరమ్మ ఇటీవల మృతి చెందగా ఎర్రమ్మగడ్డ ఆది జాంబవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ అధ్యక్షుడు జన్ను పవన్ కళ్యాణ్, గౌరవ అధ్యక్షుడు సామర్ల నాగరాజు, సలహాదారు మంద మహేష్, కోశాధికారి చిలువేరు విద్యాసాగర్, సభ్యులు జన్ను ప్రశాంత్, కొయ్యల రమేష్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్, రెండో వార్డు సభ్యుడు తిక్క సంపత్, మేకల వీరమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.