మణికొండలో ఘనంగా గణనాథుల దర్శనం
హుడా కాలనీలో భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ
మణికొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మణికొండ డివిజన్లోని(Manikonda Division) వివిధ గణేష్ మండపాల్లో కొలువుదీరిన గణనాథులను పలువురు నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. మణికొండ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కొండకల నరేందర్ రెడ్డి, మణికొండ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బి. రవికాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ చిలుకూరి బీరప్ప, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు జొన్నాడ సిద్ధప్ప, మాజీ వార్డు సభ్యుడు ధనల రాజేష్, పి. మధు తదితరులు మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా హుడా కాలనీలోని గణేష్ మండపం వద్ద కొండకల నరేందర్ రెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గణనాథుని ఆశీస్సులు భక్తులు, వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.