మున్నూరు కాపు సంఘం నూతన కమిటీకి ఘన సన్మానం

20-09-2026 | 05:07pm

రామారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో మున్నూరు కాపు జిల్లా పక్షాన నిర్వహించిన కార్యక్రమంలో రామారెడ్డి మండల మున్నూరు కాపు సంఘం(Munnuru Kapu Association) నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడిగా ల్యాగల మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా బండి లింగం, గౌరవ అధ్యక్షుడిగా చెన్నం శెట్టి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇసాయిపేట బైరయ్య, ప్రచార కార్యదర్శిగా కడెం సాయి కుమార్ ఎన్నికైన సందర్భంగా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర సెక్రటరీ నీలం నర్సింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం నర్సింలు మాట్లాడుతూ రామారెడ్డి మండలంలోని మున్నూరు కాపుల ఐక్యతతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు