కాళేశ్వరాలయం హుండీ రూ.16.60 లక్షల ఆదాయం
30-10-2026 | 08:23pm
భూపాలపల్లి /కాళేశ్వరం అక్టోబర్ 30 విజయ క్రాంతి: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం(Sri Kaleshwara Mukteshwara Swamy Temple) హుండీ లెక్కింపులో రూ.16,60,214 ఆదాయం సమకూరింది. నాలుగు నెలల 18 రోజులకు సంబంధించిన హుండీ నీ లెక్కించారు. పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఈవో ఎస్ మహేష్, ధర్మకర్తలు, సిబ్బంది, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, శ్రీ వల్లి సేవ సమితి సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.