గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి
గణపురం, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు కోరారు. గతంలో ఓటు వేసిన వారు సైతం కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 2026 సెప్టెంబర్ 28 నుండి నవంబర్ 6 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, 2023 నవంబర్ 1లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. గ్రామాల్లోని అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి నమోదు చేయించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వివరాలకు 9618180666 నంబర్లో సంప్రదించాలని కోరారు.