11వ రోజు కు చేరిన ఎన్ఎంహెచ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
హనుమకొండ లో దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించిన జనసేన నేత గడాల శ్రీనివాసరావు, బీజేపీ యువ నేత పేరం గోపికృష్ణ.
హనుమకొండ, అక్టోబర్ 23(విజయ క్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల(National Health Mission employee) జాక్ ఆధ్వర్యంలో హనుమకొండ లో జరుగుతున్న నిరవధిక సమ్మె 11 రోజుకు చేరుకుంది.ఈ సమ్మెకు జనసేన పార్టీ వరంగల్ , ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి,మాజీ హెల్త్ డైరెక్టర్ డా. గడాల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎంహెచ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతనాలు,
ఉద్యోగ భద్రతపై న్యాయమైన డిమాండ్ లను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించి, 90 రోజుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే సమ్మెకు సంఘీభావం ప్రకటించిన బిజెపి యువ నేత గోపికృష్ణ ఈ దీక్షలో మాట్లాడుతూ మిగతా ఏడు రాష్ట్రాల్లో రెగ్యులరైజేషన్ చేసినప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ ఎందుకు సాధ్యం కాదు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో పూర్తి సహకారం ఉంటుందని సూచించారు. రెగ్యులరైజేషన్ పూర్తి బాధ్యత రాష్ట్రాలదే అని సభాముఖంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నరేష్, ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సభ్యులు , డా . అభినందన్ రెడ్డి, విజయ్ ,చంద్రమౌళి, సంతోష్ , డాక్టర్ మల్లేశం,డాక్టర్ సంయుక్త,డాక్టర్ రేణుక ,డాక్టర్ కవిత ,సరిత, ప్రమీల,జ్యోతి, లావణ్య, సరిత, సంధ్య, లు సంపూర్ణ,వినోద్,కిరణ్,నరేష్,వనజ,జ్యోతి,శ్రీకాంత్ ,దినేష్ ,రాజ్యలక్ష్మి ,అంజమ్మ ,సునీత ,కళ్యాణి, పూలమ్మ, అరుణోదయ, తదితరులు పాల్గొన్నారు.