శ్రీరంగాపూర్ మండల మైనార్టీ కాంగ్రెస్ సెల్ నూతన కమిటీ నియామకం

23-10-2026 | 07:22pm

శ్రీరంగాపూర్, అక్టోబర్ 23: వనపర్తి జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో శ్రీరంగాపూర్ మండల మైనార్టీ కాంగ్రెస్ సెల్(Srirangapur Mandal Minority Congress Cell) నూతన కమిటీని నియమించారు. మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ నవీద్, ఉపాధ్యక్షుడిగా ఎండీ ఖాజా, జనరల్ సెక్రటరీగా ఎండీ చంద్ పాషా, సెక్రటరీగా ఎండీ అఖిల్‌ను నియమించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ రెడ్డి చర్ల శ్రీహరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విష్ణు ముదిరాజ్, గ్రామ అధ్యక్షుడు కుమ్మరి గోవిందు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రయ్య యాదవ్, గౌరవ సలహాదారు ఎండీ హమీద్ పాషా, పెబ్బేరు మండల మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఎండీ ఆరిఫ్, జానంపేట వార్డు సభ్యుడు ఎండీ ఇమ్రాన్, బీఎల్ఏ ఎండీ ముఖిత్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు