గౌడ సంఘం వినతికి గండ్ర గ్రీన్ సిగ్నల్!

29-10-2026 | 01:35pm

గణపురం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం గౌడ సంఘం సభ్యుల వినతిపై సానుకూలంగా స్పందించారు. గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గణపురం మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యేను గణపురం గౌడ సంఘం నూతన అధ్యక్షుడు మండ రవికుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు మచ్చిక శంకర్ గౌడ్, ఇతర సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గణపురంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్ (Community Hall) నిర్మించాలని, గణపురం కూడలిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని (Statue) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. గౌడ సంఘం సభ్యుల వినతిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సానుకూలంగా స్పందించడంతో సంఘం ప్రతినిధులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు