5 September, 2026 | 11:34 PM

నడిరోడ్డుపై ఉపాధ్యాయ దినోత్సవం

05-09-2026 | 10:20pm

జనగామ చౌరస్తా విద్యార్థులతో దిగ్బంధం

జనగామ,(విజయక్రాంతి): వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సంబంధించిన సుమారు 11 వేల కోట్ల రూపాయల రుసుము బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో విద్యార్థి సంఘాలు వినూత్న నిరసన చేపట్టాయి. విద్యార్థి ఐక్య వేదిక సమన్వయకర్త(Student United Platform Coordinator) మంగళంపల్లి రాజు అధ్యక్షతన నడిరోడ్డుపైనే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించి, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), విఫలమయ్యారని విమర్శించారు.

ఆరు సంవత్సరాలుగా రుసుముల తిరిగి చెల్లింపు, ఉపకార వేతనాల సమస్యలు(Scholarship issues) కొనసాగుతున్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని కోరారు. ఉపకార వేతనాలు, రుసుము బకాయిలను విడుదల చేయకపోతే కవిత నాయకత్వంలో,రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కౌశిక్, నాయకులు సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా సాత్విక్ రెడ్డి, జిల్లా నాయకులు మనస నిఖిల్, సందీప్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు